Wednesday, December 10, 2008

Mumbai Bomb blasts

సురాజ్య మవలేని స్వరాజ్య మెందుకని, సుఖానా మన లేని వికాస మెందుకని .... నిజాన్ని బలి కోరే సమాజ మెందుకని ... ఆవేశంగా వ్రాసిన సిరివెన్నల గీతం నాకు జ్ఞాపకం వస్తోంది. పిచి కుక్కల్లా సైర్వవిహారం చేసిన ఆ పాకిస్తాన్ లం.. కొడుకుల్ని ఇంకా క్షమిస్తున్న ఈ భారతీయిత ఫై నే సిగ్గేస్తోంది . ఇది మన చేతకాని తనం కాదా ? అత్యంత విలువైన మన సైనికులను మనం చేజేతుల పోగొట్టు కాలేదా ? దీనికి ఒక ముఖ్య మంత్రి , అతని సహచరులు రాజీనామా చేస్తే మూల్యం చెల్లించి నట్టా ? నేనెందుకు భారతీయుడుగా పుట్టానా అని ప్రతి ఒక్కడు కుమిలి పోయే దుర్దినం , మన చేతకాని తానాని కి నిలువుటద్దం. ప్రతి ఒక్కడు నడుం కట్టి , అనుమానం వున్న ప్రతి ఇన్ఫర్మేషన్ పోలీసు లకు అంద చేసి, ఉగ్రవాడు లను కూకటి వేళ్ళతో పెకలిద్దాం , నా తోటి భారతీయులారా , మీరందరూ ఈ ఉద్యమంలో భాగస్తులు కండి ... భారతీయులందరూ కాండ్రించి వుమ్మేస్తే పాకిస్తాన్, ఆ వరదల్లో కొట్టుకు పోతుంది , ఎందుకీ చేతకాని తనం, ఎన్నాళ్లి అసమర్ధ జీవితం ..... కన్ను కు కన్ను , ప్రాణానికి ప్రాణం .... .జై భారత్, అమర జవానుకు నా హృదయ పూర్వక పాదాభి వందనాలు .

Saturday, November 8, 2008

chandrayaan -

చంద్ర యానం విజయ వంతం అయిన సందర్భం గా మన దేశం లో గల అందరు మేధావులకు శిరస్సు వంచి పాదాభి వందనం చేస్తున్నాం. మన దేశం లో వున్నంత అసాధారణ మయిన మేధస్సు , మరెక్కడా లేదన్నది నిజం. 18 రోజులు అంతరిక్షం లో చక్కెరలు కొడుతూ , శనివారం మన వుపగ్రహం చంద్రుని కక్ష్య లో అడుగు పెట్టింది. మన దేశం ఈ ఘనత సాధించిన 5 వ దేశం గా అవతరించింది. ఇది ఒక అధ్బుతం. ప్రతి భారతీయుడు గర్వించ దగ్గ విషయం.

KAARTHIKA MAASAM







కార్తిక మాసం అంటే అందరకి గుర్తుకు వచ్చేది " వన భోజనాలు ". మీరు నిజంగా ఆనందించాలంటే నాకు తెలిసినంత వరకు గోదావరి జిల్లాలు టాప్. మేం క్రితం ఏడాది , మారేడుమిల్లి వెళ్ళాం .. పాములేరు వరకు. అద్బుతం.. ఫారెస్ట్ డిపార్టుమెంటు వారి ఎరంజీమెంత్స్ టూరిజం వారి ఏర్పాట్లు సూపర్ . కనీసం ఒక వెయ్యి మంది అక్కడ రకరకాలయిన చోట్ల వున్నారంటే నమ్మండి. ఎవరికీ వారు వారి వారి స్నేహితులతో, బంధువులతో తుళ్ళింతలు , కేరింతలు. ప్రపంచాన్ని మరిచి వారు ఆనందిస్తున్న తీరు చూస్తె, మనిషికి ఇంత కన్నా ఏమి కావలి అనిపించింది. వెస్ట్ గోదవరి అయితే పట్టిసీమ, పాపికొండలు .... మరిచిపోలేని , తప్పకుండ చూడవలసిన స్థలాలు. రాజోలు - దిండి రిసార్ట్స్, ఆనంద్ రిసార్ట్స్ , పట్టిసీమ, పాపికొండలు, మారేడుమిల్లి, రంపచోడవరం , పాములేరు.... ఇవన్ని చాల చక్కగా ఎంజాయ్ చేసే స్థలాలు. మీకు ఇంక ఏమియిన మంచి ప్రదేశాలు తెలిస్తే నాకు పంపండి.. ఈ బ్లాగ్ ద్వార అందరికి తెలియ చేద్దాం. వుంటాను ...మీరు వెళ్ళిన తర్వాతా అక్కడ జరిగిన సరదా సంగతులు నాకు చెప్పటం మరచిపోకండి..

Chana Masala joke

Hai, one of my Orkut friend asked me to write in engligh. For those, who really cant understand telugu, i dedicate this....
it is only about funny incident happend long back... we, myself, my brother ravi and my cousin Chiranjeevi used to be very close to each other. We used to fight among each other and make fun of one another. once it happend like, a new hotel was opened near by. I alone went there and asked for something special. They told that Sholapoori with Chanamasala curry is spl there. i ordered for it and ate. I came back home and told them that a new hotel was opened and Chana Masala is so tasty there. They were silent as if they were not caring and believing my words. I have gone outside for some work. Immediately these two people rushed to that hotel and ordered for Chanamasala. The bearer came and put Chanamasala curry in two plates on the table and went back. They both were eagerly seeing at it and discussed between each other that this is one type of Chat which they used to eat and taken two spoons and started eating the chanamasala curry. After 5 min, the bearer came and put 2 plates of shola poori (which is supposed to be eaten alongwith this curry) on the table and seen them eating curry. They got ashamed and simply ate the tiffin and came back. But after they came back, one telling other that he only doesnot know anything and ate the curry and both told me the entire story. I laughed for 1 hour and told them that morning i was trying to describe the tiffin and they only not showed any interest in listening to me. Even today we remember this joke and laugh for hours.


Not only this, the same cousin chiru once seen somebody taking the Fingerbowl assuming that it is a lemon juice....... he tells this when we talk about the above incident. he says i am better than him.. That's all for today.. Enjoyed...... if u hav any such incidents .. share with me

Tuesday, November 4, 2008

టీవీ - మన జీవన సరళి

పొద్దున్న లేస్తే ఎక్కువ సమయం అందరు గడిపేది టీవీ తోనే అనిపిస్తోంది. అందరు పలకరించుకునే విషయాలలో కూడా ఈ టీవీ వుందంటే ఆశ్చర్యం లేదు. అలంటి టీవీ లో నేడు మనం చూసేవి మన జీవితం ఫై ఎంత ప్రభావం చూపుతున్నాయి. అశ్లీలం, అనాచారం, వున్మాదం, క్రైమ్ , వయోలెన్స్ ఇవ మనం చూసేవి ? అక్రమ సంబంధాలు , మోసాలు , బలాత్కారం , కిడ్నాప్ ఇవామనం భావి తరాలకు చూపించేవి ? రాను రాను ఇలాగె చెయ్యాలేమో అనిపించేలా లేవా ఇవి ? ఈ సీరియల్స్ లో లీనం అయి పోయి మనం చేసుకునే సంభాషణలు మన పిల్లల ఫై ఎలాంటి ప్రభావం చూపుతాయి , పదే పదే వాళ్ల స్వార్ధం కోసం మా సినిమా ఇలా వుంది అంటూవూదర గొట్టే ప్రకటనలు, ఇంటర్వియూస్ . ఇవే నిజం అనుకోర ప్రజలు ? ఎక్కడకి పోతున్నాం మనం ? హింస , వున్మాదం, సెక్స్ ఇవన్ని బాహాటం గా ప్రదర్శించిన తప్పులేదేమో అనిపిచే విధంగా ఇవి లేవా? రాబోయే తరానికి మన బాధ్యతా లేదా ? ఇది వరకటి లాగ తల్లి దండ్రులు పిల్లలని కూర్చోపెట్టి తప్పు ఒప్పు చెప్పే సమయం ఈ తరం వారికి వుందా
మన కళ్ళ ఎదురుకుండా ఇలా నాశనం అవుతుంటే చూడగలమా , ఎవరు దీనికి బాధ్యతా వహిస్తారు ?