పొద్దున్న లేస్తే ఎక్కువ సమయం అందరు గడిపేది టీవీ తోనే అనిపిస్తోంది. అందరు పలకరించుకునే విషయాలలో కూడా ఈ టీవీ వుందంటే ఆశ్చర్యం లేదు. అలంటి టీవీ లో నేడు మనం చూసేవి మన జీవితం ఫై ఎంత ప్రభావం చూపుతున్నాయి. అశ్లీలం, అనాచారం, వున్మాదం, క్రైమ్ , వయోలెన్స్ ఇవ మనం చూసేవి ? అక్రమ సంబంధాలు , మోసాలు , బలాత్కారం , కిడ్నాప్ ఇవామనం భావి తరాలకు చూపించేవి ? రాను రాను ఇలాగె చెయ్యాలేమో అనిపించేలా లేవా ఇవి ? ఈ సీరియల్స్ లో లీనం అయి పోయి మనం చేసుకునే సంభాషణలు మన పిల్లల ఫై ఎలాంటి ప్రభావం చూపుతాయి , పదే పదే వాళ్ల స్వార్ధం కోసం మా సినిమా ఇలా వుంది అంటూవూదర గొట్టే ప్రకటనలు, ఇంటర్వియూస్ . ఇవే నిజం అనుకోర ప్రజలు ? ఎక్కడకి పోతున్నాం మనం ? హింస , వున్మాదం, సెక్స్ ఇవన్ని బాహాటం గా ప్రదర్శించిన తప్పులేదేమో అనిపిచే విధంగా ఇవి లేవా? రాబోయే తరానికి మన బాధ్యతా లేదా ? ఇది వరకటి లాగ తల్లి దండ్రులు పిల్లలని కూర్చోపెట్టి తప్పు ఒప్పు చెప్పే సమయం ఈ తరం వారికి వుందా
మన కళ్ళ ఎదురుకుండా ఇలా నాశనం అవుతుంటే చూడగలమా , ఎవరు దీనికి బాధ్యతా వహిస్తారు ?
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
ఎవరు బాధ్యత వహించడమేమిటి? దీనికి మనదే బాధ్యత.
వెరీ సింపుల్, ఎవరి కేబుల్ కనెక్షన్ వాళ్ళు పీకి పక్కన పెట్టడమే.
Post a Comment